HomeTelugu Trendingపెళ్లి పీటలు ఎక్కబోతున్న నాగశౌర్య

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నాగశౌర్య

Naga Shaurya to get married
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. అనూష అనే అమ్మాయిని నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నారు. నవంబర్ 20వ తేదీన వీరి వివాహం జరగనుంది. బెంగళూరులోని జెడబ్ల్యు మారియట్ లో నాగశౌర్య – అనూష పెళ్లి వైభవంగా జరగనుంది. శౌర్య వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక పెళ్లికి ముందు జరిగే వేడుకలు కూడా పూర్తిగా అక్కడే జరగనున్నాయని సమాచారం.

నాగశౌర్య పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సరైన సమయంలో ప్రకటిస్తానని యువ హీరో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా అనూష అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu