మోదీ నిర్ణయం మంచిదేనంటున్న నటుడు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయంపై చాలా మంది ప్రముఖులు
హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, ఆలు అర్జున్, నాని, విజయ్ ఇలా చాలా మంది
హీరోలు మోదీ నిర్ణయాన్ని కొనియాడారు. ఇప్పుడు నాగబాబు వంతు వచ్చింది. పెద్ద నోట్లపై
మోదీ తీసుకున్న నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇన్నేళ్ళ స్వతంత్ర దేశంలో గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధాని మంత్రిగా మోదీ దేశ చరిత్రలో
నిలిచిపోతారని చెప్పారు. ప్రకృతి విపత్తులను సైతం ఎదుర్కొని నిలబడిన ప్రజలు మోదీ
నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం సమంజసంగా లేదని మోదీకి అందరూ సహకరించాలని
కోరారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయనపై విమర్శలు చేస్తోన్న రాజకీయనాయకులు కొందరు
ఆ పనిని మానుకోవాలని చెప్పారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లను
కూడా వచ్చే ఎన్నికల్లోపు రద్దు చేసి కొత్త నోటు తీసుకొస్తే స్వచ్చమైన ఎన్నికలు జరిగే అవకాశం
ఉందని అన్నారు.