HomeTelugu NewsAjith Kumar: భర్తకి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన షాలిని

Ajith Kumar: భర్తకి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన షాలిని

Ajith Kumar

Ajith Kumar: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్ 53వ పుట్టినరోజు కావండతో సెలబ్రెటీలతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తేలియజేశారు. ఇక తన భార్య, నటి షాలిని అజిత్‌కి ఓ అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చారు. అజిత్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసిన షాలిని ఆయనకి డుకాటీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అజిత్ ప్రొఫిషనల్‌ రేసర్ అన్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర చాలా రకాలైన స్పోర్ట్స్, రేసింగ్ బైక్స్ కలెక్షన్ ఉంది. దీంతో అజిత్‌కి నచ్చిన గిఫ్టే ఇచ్చారు షాలిని. ప్రస్తుతం అజిత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విడా ముయార్చి, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల అజిత్ ఆక్సిడెంట్ వీడియో ఒకటి వైరల్ అయింది. విడా ముయార్చి సినిమా షూటింగ్‌ సమయంలో చేసిన ఓ రిస్కీ స్టంట్‌‌లో అజిత్‌కి గాయాలయ్యాయి.

Shalini – Ajith Kumar : అజిత్ బర్త్ డేకి భార్య షాలిని ఇచ్చిన గిఫ్ట్ అదిరిందిగా.. భర్తకు ఇష్టమని..

ఇందుకు సంబంధించిన వీడియోను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఓ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ వీడియో. ఇందులో అజిత్ కార్ నడుపుతూ ఓ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైన ఆ కారు అదుపు తప్పి పడిపోయింది. వెంటనే సిబ్బంది కారు దగ్గరకి వెళ్లి అజిత్ సహా మరో యాక్టర్‌ని బయటకి తీసే ప్రయత్నం చేశారు.

గత ఏడాది నవంబర్‌లో ఈ సంఘటన జరగ్గా ఇటీవల అజిత్ మేనేజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన తలా ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడ్డారు. సాధారణంగా సినిమాల్లో రిస్కీ స్టంట్స్ అన్నీ అజిత్ స్వయంగా చేస్తుంటారు. ఎలాంటి డూప్, బాడీ డబుల్‌ను పెట్టేందుకు ఇష్టపడరు. కానీ మరీ ఈ రేంజ్‌లో రిస్క్ తీసుకొని చేయడం కరెక్ట్ కాదంటూ అభిమానులు కోరుతున్నారు. కానీ అజిత్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఏది ఏమైనా చేసే పనిపై అజిత్ డెడికేషన్‌కి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!