HomeTelugu Trendingబిగ్‌బాస్‌‌-4 అప్డేట్..

బిగ్‌బాస్‌‌-4 అప్డేట్..

Nagarjuna shoot for bigg bo
తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. గత సీజన్ కి హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జునే సీజన్-4కు కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ ఇటీవల జరిగింది. హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరించారు. దీనికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్ని నాయన ఫేం’ దర్శకత్వం వహించగా, ప్రముఖ కెమెరామేన్ కె.కె.సెంథిల్ కుమార్ ఈ ప్రోమోను చిత్రీకరించడం జరిగింది. ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా చర్యల నేపథ్యంలో దీనిని షూట్ చేశారు.

ఇక త్వరలోనే ఈ ప్రోమోను టీవీలలో ప్రసారం చేస్తారని సమాచారం. అలాగే, మరోపక్క ఈ కార్యక్రమంలో పాల్గొనే సభ్యులు ఎంపిక కూడా దాదాపు పూర్తయిందట. షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నుంచి షోని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu