HomeTelugu Trendingమామా మశ్చీంద్రా: సుధీర్‌బాబు డీజే లుక్‌

మామా మశ్చీంద్రా: సుధీర్‌బాబు డీజే లుక్‌

sudheer babu 3rd look from

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తున్న ఇప్పటి వరకు ఒక సినిమా కూడా కమర్షియల్ హిట్లు మాత్రం కాలేకపోతున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన హంట్‌ సుధీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్రా’.

ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా వాటిలో రెండు పరశురామ్ మరియు దుర్గ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ని ఇప్పటికే విడుదల చేశారు.

తాజా మూడో పాత్ర డీజే లుక్‌ విడుదల చేశారు. ఈ పాత్రలో సుధీర్‌ బాబు తన ఒరిజినల్ లుక్ లో మంచి స్టైలిష్ గా కనిపించాడు. సుధీర్‌ ఇటువంటి డిఫెరెంట్‌ మూవీ చేయడం ఇదే ఫస్ట్‌. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన దుర్గ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ లుక్‌ లడ్డూబాబు.. సినిమాలో పాత్రను కలిగి ఉంది.

దీంతో ఈ పాత్ర కామెడీగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో విడుదలైన క్లిప్‌ కూడా ఇదే తరహాలో ఉంది. సుధీర్‌ బాబు చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu