HomeTelugu Trendingబ్రహ్మాస్త్రం: నాగార్జున ఫస్ట్‌లుక్‌ విడుదల

బ్రహ్మాస్త్రం: నాగార్జున ఫస్ట్‌లుక్‌ విడుదల

Nagarjuna look from Brahmas
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. ఈ సినిమా తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరుతో విడుదల కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్- అలియాభట్ జంటగా నటిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున “నంది అస్త్ర” అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు.

రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి “బ్రహ్మాస్త్రం” సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో సందర్శించిన సంగతి తెలిసిందే. జూన్ 15న బ్రహ్మస్త్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మరమైన సినిమాను సెప్టెంబర్‌ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu