HomeTelugu Trendingఆకట్టుకుంటున్న 'తలైవి' ఫస్ట్‌ సాంగ్‌

ఆకట్టుకుంటున్న ‘తలైవి’ ఫస్ట్‌ సాంగ్‌

Thalaivi first song release
జయలలిత బయోపిక్ ‘తలైవి’ పేరుతో తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ పాట నుంచి తొలి పాట విడులైంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ‘ఇలా ఇలా’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. 60లలో జయలలిత నటించిన సినిమాలలోని పాటలను పోలి ఉండేలా చిత్రీకరించిన ఈ పాటను సిరాశ్రీ రాయగా సైంధవి పాడారు. జీవి ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను విష్ణు ఇందుకూరి, శైలేష్‌ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్, తొలి పాటతో ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుందనే చెప్పాలి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu