ఫోర్బ్స్ టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాలో ఉపాసన

ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధిక సంపన్నుల జాబితాను అలాగే ఇండియాలో సంపన్నుల జాబితా వివరాలను ప్రకటిస్తుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను కేవలం ఇండియాను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రూపొందించింది. వ్యాపార, క్రీడా, చిత్ర రంగాలకు చెందిన వారి వివరాలను ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో క్రీడా రంగం నుంచి పీవీ సింధుకు మాత్రమే చోటు దక్కగా, వ్యాపార రంగం నుంచి అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ ఉపాసనకు చోటు దక్కింది.