HomeTelugu Trendingచిరంజీవి దర్శకుడితో నాగార్జున 100వ సినిమా!

చిరంజీవి దర్శకుడితో నాగార్జున 100వ సినిమా!

Nagarjuna

టాలీవుడ్‌లో 1986లో.. ‘విక్రమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అప్పటి నుంచి ఆయన నట ప్రయాణాన్ని కొనసాగిస్తూన్నారు. తన 50వ సినిమాను .. 75వ సినిమాను నాగార్జున ఎప్పుడూ హైలైట్ చేయలేదు. దాంతో ఆయున 100వ సినిమా ఎప్పుడు? అనేది ఆసక్తికరంగా మారింది. ‘బంగార్రాజు’ సినిమా సమయంలోనే 100వ సినిమా ప్రస్తావన వస్తే, ఆ లెక్కల విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తానని నాగార్జున అన్నారు. కానీ ఇప్పుడేమో ఆయన 100వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు తెలుస్తుంది. ఈ సినిమాకి డైరెక్టర్‌ మోహన్ రాజా అనే వార్త బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నాడు. చిరంజీవి ద్వారానే ఆయన నాగార్జునను కలిసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే నాగార్జున కథ వినేశారనీ .. కొన్ని మార్పులు చెప్పారని అంటున్నారు. ‘ది ఘోస్ట్’ తరువాత ఆయన సెట్స్ పైకి వెళ్లేది మోహన్ రాజాతోనేనా? లేదంటే మధ్యలో వేరే సినిమాలేమైనా ఉన్నాయా? అనేది తెలియల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!