HomeTelugu Trendingఎలియన్‌గా రకుల్‌..

ఎలియన్‌గా రకుల్‌..

Rakul Preet Singh as alien
టాలీవుడ్‌లో హీరోయిన్‌ రకుల్‌కి కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ వచ్చాయి. స్టార్స్ దృష్టిలో పడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్ వంటి వారి స్టార్‌ హీరోలకు జంటగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది. అయితే గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా పోయింది ఈ భామకు. ప్రస్తుతం రకుల్ మాత్రం క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఒలింపిక్ విన్నర్‌ కరణం మల్లీశ్వరి బయోపిక్ లో రకుల్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు ఓ ద్విభాషా చిత్రంలో ప్రయోగాత్మక పాత్రలో కనిపించనుందట. పీకే సినిమాలో అమీర్ ఖాన్ స్ఫూర్తి తో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఏలియన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం రకుల్ సెమీ న్యూడ్ గా కనిపించబోతుందట. తమిళ్ – తెలుగు భాషల్లో రెడీ అవుతున్న ఈ సినిమాలో రకుల్ గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu