HomeTelugu Trendingనాగార్జున నాసామిరంగ ఫస్ట్ సింగిల్

నాగార్జున నాసామిరంగ ఫస్ట్ సింగిల్

Nagarjuna Naa Saamiranga siఅక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

నాసామిరంగ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్ రిలీజైంది. ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే…’ అంటూ పల్లెటూరి పదాలతో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నారు. నాసామిరంగ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు. నాగార్జున ఫుల్ మాస్ గెటప్‌లో మరోసారి అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu