HomeTelugu Trendingక్రిష్‌-వైష్ణవ్‌ తేజ్‌ సినిమా టైటిల్ ఇదేనా!

క్రిష్‌-వైష్ణవ్‌ తేజ్‌ సినిమా టైటిల్ ఇదేనా!

Krish Vaishnav Tej movie ti
ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ తన రెండోవ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘జంగిల్‌బుక్’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu