HomeTelugu Trendingదర్శకుడితో రియల్‌ లైఫ్‌లో టాస్క్‌లు చేయించిన నాగ్‌

దర్శకుడితో రియల్‌ లైఫ్‌లో టాస్క్‌లు చేయించిన నాగ్‌

7 18
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘మన్మథుడు 2’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత నాగార్జున, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో ఓ ప్రాంక్‌ వీడియో చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్‌ను ఓ రెస్టారెంట్‌కు పంపించి రకరకాల టాస్క్‌లతో ఇబ్బంది పెట్టాడు.

ఈ ఆదివారం నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున.. రాహుల్‌తో రియల్‌ లైఫ్‌లోనే అలాంటి టాస్క్‌లు చేయించాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ కాగా.. ప్రముఖ నటి, అక్కినేని కోడలు సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో అలరించనున్నారు. వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌, ఝాన్సీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu