HomeTelugu Trendingబాలయ్య దూకుడు.. రెమ్యునరేషన్‌ పెంచేశాడుగా!

బాలయ్య దూకుడు.. రెమ్యునరేషన్‌ పెంచేశాడుగా!

nandamuri Balakrishan incre

నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా దుమ్మురేపుతున్నారు. ఇటు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బంపర్ హిట్స్ అందుకున్నారు. దీంతో బాలయ్య రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది.

బాలయ్య తన రెమ్యునరేషన్ ను రూ. 20 కోట్లు చేసినట్టు టాక్‌. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకి బాలయ్య ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య సినిమాలు రూ. 70 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయి. దీనికి తోడు ఓటీటీ, టీవీ, డిజిటల్ హక్కుల విషయంలో కూడా డిమాండ్ భారీగా ఉంది. దీంతో, ఆయన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది.

Balakrishan 1

బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య. పూరి, క్రిష్, బోయపాటి కూడా లైన్‌లో ఉన్నారు. వీరే కాదు.. యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా చెప్పిన లైన్స్ కూడా బాలయ్యకు నచ్చినట్లు తెలుస్తోంది. NBK 109ని ఓ కొత్త డైరెక్టర్‌తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu