‘రాజావిక్రమార్క’గా కార్తికేయ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ తాజాగా ఓ చిత్రాని ప్రకటించిన సంగతి తెలసిందే. కార్తికేయ 7వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌కి `రాజావిక్రమార్క` టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 1990లో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ సందీప్‌ వంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కార్తికేయ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఇక ఈ మూవీలో ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తాన్యా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించింది. రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మెంటల్‌ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్‌ ఆర్‌. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates