HomeTelugu Trendingబాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌ షురూ..

బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌ షురూ..

9

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కింది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం ఆర్‌ఎఫ్‌సీలో ప్రారంభమైంది. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేసారు. బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ షెడ్యుల్‌ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు

ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్స్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో నటీనటులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు మూవీయూనిట్‌ తెలిపింది. ఎస్‌.ఎస్ థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu