HomeTelugu Big Storiesకొత్త సినిమా కోసం బాలయ్య న్యూ లుక్‌.. పండగ చేసుకుంటున్న అభిమానులు

కొత్త సినిమా కోసం బాలయ్య న్యూ లుక్‌.. పండగ చేసుకుంటున్న అభిమానులు

13 5నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు. అంతేకాదు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. అది కూడా రెండు పాటలతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేదే ఈ మూవీ స్టోరీ. ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నమిత మరోముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లుక్‌లో ఫ్రెంచ్ గడ్డంతో ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ అవాక్కయ్యేలా చేసాడు బాలయ్య. ఈ లుక్‌లో బాలకృష్ణను చూస్తుంటే.. ముప్పై యేళ్లు యువకుడిలా కనిపిస్తున్నాడు. కే.యస్.రవికుమార్ సినిమా కోసం బాలయ్య బాగానే తగ్గినట్టు కనిపిస్తుంది. ఏమైనా కొత్త లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతికి లేదా సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. మరోవైపు ‘క్రాంతి’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి నందమూరి నాయకుడు బాలయ్య సరికొత్త గెటప్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

balayya1 jpg

Recent Articles English

Gallery

Recent Articles Telugu