HomeTelugu Newsమోక్షజ్ఞకు పాలాభిషేకం చేసిన బాలయ్య అభిమానులు

మోక్షజ్ఞకు పాలాభిషేకం చేసిన బాలయ్య అభిమానులు

9 3నందమూరి బాలక‌ృష్ణ అప్పుడప్పుడు అభిమానుల మీద చేయి చేసుకున్నా.. బాలయ్య మీద ఉన్న అభిమానం రెట్టింపు అవుతుందే కానీ ఎక్కడా తగ్గదు. నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ అంటే కూడా నందమూరి అభిమానులు అంతే ప్రేమ చూపిస్తారు. ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయకపోయినా, బయట కనిపించకపోయినా కూడా మోక్షజ్ఞ అంటే వారికి పిచ్చి. అలాంటి మోక్షజ్ఞ పుట్టిన రోజు అంటే ఇంకెంత రచ్చ చేయాలి. నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే ఈరోజే (సెప్టెంబర్ 6). దీంతో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో పలు చోట్ల బాలయ్య యూత్, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డీజేలు పెట్టి ధూంధాంగా ఆడిపాడారు. ఇక గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో అయితే మరింత ముందుకెళ్లారు. ఏకంగా మోక్షజ్ఞ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నందమూరి కుటుంబంపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu