HomeTelugu Trendingనందినీ రెడ్డితో ఏక్‌ మినీ కథ హీరో!

నందినీ రెడ్డితో ఏక్‌ మినీ కథ హీరో!

Nandini reddy movie with eటాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్ ‘ఏక్ మినీ కథ’ సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు‌. ప్రస్తుతం ఈయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి‌. ఓ బేబీతో హిట్‌ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనూ సినిమాలు చేసేందుకు నందినీరెడ్డి సైన్‌ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇవి పూర్తయ్యాకే నందినీ రెడ్డితో మూవీ ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో సంతోష్‌ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు సమాచారం. ‘తను నేను’ .. ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్‌ శోభన్‌ తాజాగా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఈ యంగ్‌ హీరోతోనే నందినీ రెడ్డి తర్వాతి సినిమా ఉండనుందని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu