HomeTelugu Trending'నాని 30'వ సినిమా ప్రారంభం

‘నాని 30’వ సినిమా ప్రారంభం

Nani 30 movie launched
నేచురల్‌ స్టార్‌ నాని 30వ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని వెంకట్ మోహన్, విజయేందర్ రెడ్డి .. మూర్తి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిరంజీవి క్లాప్ తో ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి సురేశ్ బాబు, అశ్వనీదత్, దిల్ రాజు, విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు, కిశోర్ తిరుమల, వశిష్ఠ, అనంత శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Nani 301

ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ అల్లుకున్నకథ ఇది. వారి ఎమోషన్స్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. కాగా నాని నటిస్తున్న తాజాగా చిత్రం ‘దసరా’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఈసినిమాపై అంచనాలు పెంచేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu