‘మా’ అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నికల హడావుడి మొదలైంది. ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా..ఇప్పుడు హీరో మంచు విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెబుతున్నారు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే విష్ణు అడుగులు వేస్తున్నాడట.

తండ్రి, మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమైయ్యాడు. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి… ఇవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారట. ఈసారి ‘మా’ అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates