‘నటరాజు’ నాని కోసమేనా..?

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని రీసెంట్ గా ‘నేను లోకల్’ చిత్రంతో తన లిస్ట్ లో మరో హిట్ ను వేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయనతో నానితో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే రీసెంట్ గా దిల్ రాజు ఫిల్మ్ నగర్ లో ‘నటరాజు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. దిల్ రాజు, నాని కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే దిల్ రాజు మరే కొత్త ప్రాజెక్ట్స్ ఫైనల్ చేయలేదు కాబట్టి ఈ టైటిల్ నాని కోసమే అని స్పష్టంగా తెలుస్తోంది. నేచురల్ స్టార్ కి నటరాజు అనే టైటిల్ కూడా పెర్ఫెక్ట్ గా సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నటరాజుగా ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తాడో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates