HomeTelugu Trending'టక్‌ జగదీష్‌' ఓటీటీలోనే.. నాని కామెంట్స్‌

‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలోనే.. నాని కామెంట్స్‌

tuck jagadesh

నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా దీనిపై నాని స్పందించారు. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. నిర్మాత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పుడిప్పుడే థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతున్నా, ఏపీలో పూర్తి స్థాయిలో తెరుచుకోని నేపథ్యంలో ‘టక్‌జగదీష్‌’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్‌ భావించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. రిలీజ్‌ డేట్‌ తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu