HomeTelugu Trendingనాని మూవీ "అంటే సుందరానికి" నుంచి మరో సాంగ్

నాని మూవీ “అంటే సుందరానికి” నుంచి మరో సాంగ్

Nani movie Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని హీరోగా “అంటే సుందరానికి” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘అంటే … సుందరానికీ’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ ప్రేక్షకులను బాగా అకట్టుకుంది. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పుడు రెండో సాంగ్ ‘ఎంత చిత్రం’ లిరికల్ సాంగ్ మే 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇంకా ఈ మూవీలో నదియా, రోహిణి, నరేశ్, సుహాస్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu