బన్నీకి నాని కథ నేరేట్ చేశాడట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి యంగ్ హీరో నాని ఓ కథ వినిపించాడట. ఆ కథ బన్నీకి కూడా బాగా నచ్చిందట. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు.. నాని హీరో కాకముందు స్టోరీ.. కానీ తాజాగా ఈ విషయాన్ని నాని వెల్లడించారు. హీరో కాకముందు నాని దర్శకత్వశాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దర్శకుడు కావాలనే పట్టుదల నానిలో బలంగా ఉండేదట.
ఆ ఆసక్తితోనే కథ రాసుకొని బన్నీకి వినిపించాడట నేచురల్ స్టార్. కానీ ఈలోగా నానికి ‘అష్టాచమ్మా’ అవకాశం రావడం తరువాత హీరోగా మారిపోవడంతో ఆ కథ అలానే ఉండిపోయిందట.

ఇప్పటికీ బన్నీ ఎప్పుడైనా.. నానిని కలిస్తే ఆ కథ అలానే ఉంచమని చెబుతుంటాడట. దానికి నాని అలాగే అని సమాధానం ఇచ్చేప్పుడు అసలు సంగతి అర్ధం కాక తన చుట్టూ ఉన్న వాళ్ళు వింతగా చూస్తుంటారంటూ నవ్వేశాడు ఈ యంగ్ హీరో. నాని అయితే ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు. మరి దానికి బన్నీ అవకాశం ఇస్తాడేమో చూడాలి!