HomeTelugu Big Stories'సలార్‌' టీజర్‌ వచ్చేస్తుంది

‘సలార్‌’ టీజర్‌ వచ్చేస్తుంది

Salaar teaser release date
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ప్రభాస్‌కు సరైన హిట్‌ పడలేదు అనే చెప్పాలి. తాజాగా విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. దీంతో సలార్‌ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. కీలక పాత్రలపై చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ నెల 6న సలార్ టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆరో తేదీన ఉదయం 5.12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. శ్రుతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu