HomeTelugu Trendingనాని కొత్త సినిమా 'సరిపోదా శనివారం'

నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’

Nani new movie saripodhaa s 1

దసరా సందర్భంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్తం చిత్రం టైటిల్ ను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ ‘సరిపోదా శనివారం’. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. నాని కెరీర్ లో ఇది 31వ చిత్రం.

ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇవాళ టైటిల్ తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియో చూస్తే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu