
Tollywood WhatsApp group:
ఓహో! మన టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఉండేవారని మీకు తెలుసా? అదీ మామూలు గ్రూప్ కాదు, ఏకంగా 143 మంది సెలబ్రిటీలతో – అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నాని లాంటి స్టార్స్ కూడా ఉండేవారట! ఈ విషయాన్ని తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
ఆగ్రూప్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ కోసం, సినిమాల ప్రోమోషన్ కోసం ఏర్పడిందట. కొత్త ట్రైలర్లు షేర్ చేస్తూ, జోక్స్ వేస్తూ, ఫుల్ ఎనర్జీతో సాగిందట. కానీ, రోజూ 60కి పైగా మెసేజ్‌లు వస్తుండటంతో నాని డైరెక్ట్‌గా “mute” చేశాడట. “మేము వర్క్ చేయాలి కూడా కదా!” అంటూ నవ్వేశాడు.
“ఒక్కోసారి ఫోన్ ఓపెన్ చేస్తే 100 మెసేజ్‌లు అన్‌రెడ్‌గా ఉండేవి. అందుకే నేను చూసేదే కాదు,” అని నాని సింపుల్‌గా చెప్పేశాడు. స్టార్స్ అంతా బిజీ అవ్వడంతో, కొన్ని సంవత్సరాల్లో ఆ గ్రూప్ ఫేడౌట్ అయిపోయిందట. కొంతమంది నెంబర్లు మార్చేసారు, ఇంకొందరు కాల్‌తో బిజీ, గ్రూప్ పేరే మరిచిపోయారట.
అయితే ఆ గ్రూప్ మ్యూజ్ అయిపోయినప్పటికీ, ఆ రోజులు మాత్రం నాని హృదయంలో ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయట. ఇప్పుడు అయితే, నాని తన నెక్ట్స్ ఫిల్మ్ HIT 3 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మే 1న థియేటర్స్‌లోకి రాబోతోంది ఈ యాక్షన్ థ్రిల్లర్.
అంటే మన స్టార్ హీరోలందరూ ఒకే గ్రూప్‌లో ఉండేవారనేది నిజమే! కానీ ఎంతగా సరదాగా ప్రారంభించినా… బిజీ లైఫ్‌కు ఆ గ్రూప్ కూడా సైలెంట్ అయిపోయింది!













