HomeTelugu Big StoriesNani: నానికి విలన్‌గా స్టార్‌ నటుడు

Nani: నానికి విలన్‌గా స్టార్‌ నటుడు

nani saripodhaa sanivaaram

Nani: నేచురల్ స్టార్ నాని ఇటీవలు హాయ్‌ నాన్న సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్‌తో కలిసి చేసిన ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా నాని మరోసార తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ హార్ట్ టచ్ చేశాడు.

ప్రస్తుతం వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ను నటిస్తుంది. తాజా మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ విడుదలైంది. టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.

ఒకప్పుడు డైరెక్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఎస్ జే సూర్య ఇప్పుడు యాక్టర్‌గా బిజీ అయిపోయారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో అటు విలన్ సహా కమెడియన్ రోల్స్‌లో మెప్పించారు. ఇక తాజాగా ఈ సినిమాలో కూడా విలన్ రోల్‌కి ఎస్ జే సూర్య ఓకే చెప్పారు.

ఇప్పటికే సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ విషయాన్ని మూవీ ప్రొడక్షన్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండు వరుస హిట్లు కొట్టిన నాని చేస్తున్న ఈ ‘సరిపోదా శనివారం’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu