HomeTelugu Big Storiesఒకే ఫ్రేములో స్టార్‌ హీరోలు.. షేర్‌ చేసిన నాని

ఒకే ఫ్రేములో స్టార్‌ హీరోలు.. షేర్‌ చేసిన నాని

Natural star nani shares th
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పిక్ నిన్న ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకండా అన్ని ఇండస్ట్రీస్ హీరోలు తమ స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్‌, ప్రభాస్, రానాలతో కలిసి దిగిన పాత ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు.

ఇప్పుడీ ఫొటోలను ఆయా హీరోల ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో తన ఆప్తులు అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానాలను నాని పేర్కొనడం విశేషం. ఇక ఈ ఫొటో రాజమౌళి కుమారుడు కార్తికేయ వెడ్డింగ్ సందర్భంగా రాజస్థాన్‌లో దిగినది. దీంతో పాటు నాని..వివిధ సందర్భాల్లో తన స్నేహితులతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu