విలన్ పాత్రలో యంగ్ హీరో!

ఈ మధ్య కాలంలో హీరోలు సైతం పాత్రలు నచ్చితే విలన్స్ గా నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆది ఇప్పటికే సరైనోడుతో తనలో నెగెటివ్ యాంగిల్ ను చూపించాడు. అలానే నవీన్ చంద్ర కూడా విలన్ గా నాని సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు మరో హీరో విలన్ రోల్ లో
నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళంలో ఓ సినిమా రూపొందనుంది. ఉన్నికృష్ణన్ దర్శకుడు. అయితే ఈ సినిమాలో విశాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మోహన్ లాల్ వెల్లడించారు. దీంతో విశాల్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

పైగా దర్శకుడు ఉన్నికృష్ణన్ ఈ సినిమాలో విశాల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాల్లోనే కనిపించిన విశాల్ ఇప్పుడు మలయాళం సినిమాలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ సినిమా విశాల్ కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో.. చూడాలి!