HomeTelugu Trendingశ్యామ్ సింగరాయ్ లో బెంగాలి నటుడు

శ్యామ్ సింగరాయ్ లో బెంగాలి నటుడు

Nani Shyam singha roy tea
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా చిత్రీకరణలో మరో విలక్షణ నటుడు పాల్గొన్నారు. ఈ మేరకు సినిమా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అతడెవరో కాదు.. బెంగాలి నటుడు జిష్షు సేన్‌గుప్త. భీష్మ, అశ్వథామ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇతడు శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించనున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సేన్‌గుప్త ఎటువంటి పాత్రలో కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నాని టక్‌ జగదీష్‌ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu