నాని ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’ లిరికల్‌ వీడియో

నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. ఈ సినిమాకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి గురువారం సాయంత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’ పేరుతో లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అణిగిమణిగిన అలలే ఎగసెను చూడరా’ అంటూ సాగిన గీతం ఆకట్టుకుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందించిన ఈ పాటను కాలభైరవ ఆలపించారు.