HomeTelugu NewsMohan Babu: నాపేరు ఉపయోగిస్తే.. చర్యలు తప్పవు!

Mohan Babu: నాపేరు ఉపయోగిస్తే.. చర్యలు తప్పవు!

Mohan Babus open letter is

Mohan Babu: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు తన పేరును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని సోష‌ల్ మీడియా వేదికగా వార్నింగ్‌ ఇచ్చారు.

”ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచం లో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను”.

అంటూ మోహన్ బాబు ఒక లేఖను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ట్వీట్ వైరల్‌గా మారింది. ఆయన తన కొడుకు డ్రీమ్‌ ప్రొజెక్ట్‌ ‘కన్నప్ప’లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu