HomeTelugu Big Storiesమావయ్య నటన నభూతో నభవిష్యతి అంటున్న నారా లోకేష్

మావయ్య నటన నభూతో నభవిష్యతి అంటున్న నారా లోకేష్

8 13‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు… మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా’.. అంటూ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ తొలిభాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేనప్పటికీ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదుల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు (ఫిబ్రవరి 16) ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్‌ 2 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో చేరింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు ఆయన అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్. ‘వెండితెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్‌లో రెండవ భాగం ‘మహానాయకుడు’ చిత్ర ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడుగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి’ అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu