‘బిగ్ బాస్’ షోలో దీపిక ఆసక్తికర సమాధానాలు!

ప్రస్తుతం దీపిక పడుకొనే నటిస్తోన్న ‘పద్మావతి’ సినిమా సంచలనాలకు కేంద్రమైంది. ఈ సినిమాకు సంబంధించి కర్నిసేన చేస్తోన్న వార్నింగులు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే చిత్రనిర్మతలు మాత్రల్ వెనుకడుగు వేయడం లేదు. ప్రచార కార్యక్రమాలు మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దీపిక బిగ్ బాస్ రియాలిటీ షోకు హాజరైంది. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత స‌ల్మాన్ ఖాన్, దీపికాతో ఒక గేమ్ ఆడించాడు. దాని పేరు డేట్‌, మ్యారీ, కిల్‌. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, నటులు ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌ల‌లో ఎవ‌రితో ఏం చేస్తావో చెప్పాల‌ని అడిగాడు.

అందుకు దీపికా.. భ‌న్సాలీని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. దానికి కంగుతిన్న స‌ల్మాన్… స‌రే! కొద్ది రోజుల వ‌ర‌కైతే ఓకే అంటూ కౌంట‌ర్ వేశాడు. త‌ర్వాత ర‌ణ్‌వీర్‌తో డేట్ చేస్తాన‌ని, షాహిద్‌ని చంపుతాన‌ని చెప్పింది. షాహిద్ ఎందుకు చంపాల‌నుకుంటున్నావని స‌ల్మాన్ అడ‌గ్గా.. అత‌నికి పెళ్లైంది క‌దా.. అంటూ చ‌మ‌త్క‌రించింది.