HomeTelugu Trending'నారప్ప' సెన్సార్‌ పూర్తి

‘నారప్ప’ సెన్సార్‌ పూర్తి

Narappa sensor completed

వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. భారీ వసూళ్లతోపాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. దాంతో డైరెక్టర్‌ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అసలు ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌ కు జంటగా ప్రియమణి నటించగా, ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu