HomeTelugu Trendingఎన్టీఆర్‌తో నాని ఫొటో వైరల్‌

ఎన్టీఆర్‌తో నాని ఫొటో వైరల్‌

natural star nani shares a
టాలీవుడ్‌ స్టార్‌ హీరో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ అభిమాని కోరిక మేరకు నాని ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోని ‘ఎక్స్’ వేదికగా నాని షేర్ చేశాడు.

ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని కనిపించిన ఈ పిక్‌ని ఓ అభిమాని విజ్ఞప్తి మేరకు నాని పంచుకున్నాడు. ‘మీది, తారక్ అన్నది అన్‌సీన్ పిక్ చూపించండి ప్లీజ్’ అంటూ ఓ నెటిజన్ ‘ఎక్స్’లో కోరగా నేచురల్ స్టార్ స్పందించాడు. ఇది ఓకే నా? అంటూ ఫొటోని పంచుకున్నాడు.

ఈ ఫొటోని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కనుల విందుగా ఉందని సంబరపడుతున్నారు. కాగా ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆస్క్ నాని’ పేరుతో నెటిజన్లతో సంభాషించాడు. అందులో భాగంగా అభిమాని కోరిక మేరకు ఎన్టీఆర్‌తో ఉన్న ఫొటోని పంచుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu