HomeTelugu Newsవినూత్నంగా 'నాట్యం' రిలీజ్‌ డేట్‌ విడుదల

వినూత్నంగా ‘నాట్యం’ రిలీజ్‌ డేట్‌ విడుదల

Natyam movie release date a
కూచిపూడి కళాకారిణి సంధ్యారాజు ప్రధానమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. ఈ సినిమా నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించారు. కొరియోగఫీ .. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఆమెనే చూసుకున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్, ఫస్ట్‌ సింగిల్ , పాటకు మంచి స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విశేషం ఏమంటే… ఈ విషయాన్ని కేవలం మాటలతో చెప్పకుండా… మూవీ విడుదల కాబోతున్న హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 ఎం.ఎం. ఆవరణలో తన శిష్యులతో కలిసి నృత్యరూపకం ద్వారా తెలిపారు సంధ్యారాజు. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu