ఇదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మ‌ల్టీస్టార‌ర్


‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన తాజాగా ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా రవితేజ, శర్వానంద్ ని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వాళ్ళ ఈ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నారు. ఇక స్థానంలో సిద్దార్థ్‌ హీరోగా చేయనున్నాడు. అయితే ఈ సినిమా పై స్పందించిన దర్శకుడు ఇదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఇంకా నేను మరోసారి నాజీవితం లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చెయ్యను అని చెప్పాడు. ఎందుకంటే.. ఇలాంటి సినిమా కథ రాయడం ఓ పెద్ద పనైతే మళ్ళీ అందులో నటించడానికి ఇద్దరు హీరోలను ఒప్పించడం మరో పని అంటూ వివరించాడు. అయితే ఈ సినిమాకు మహా సముద్రం అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది.