HomeTelugu Trendingడ్రగ్స్‌ కేసు: నాకేం బాధ లేదు బ్రదర్‌..

డ్రగ్స్‌ కేసు: నాకేం బాధ లేదు బ్రదర్‌..

Navdeep reply to netizen Drబాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌బీసీ) అధికారులు రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేశారు. విచారణ క్రమంలో రియా 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, ముఖేష్‌ చబ్రా పేర్లను కూడా ఆమె బయటపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రకుల్‌, రియా కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 30 వేల ట్వీట్లతో RakulPreetSingh అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌.. ‘ఇది మళ్లీ టాలీవుడ్‌కు యూటర్న్‌ తీసుకుంది. నవదీప్‌ అన్న మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచెం జాగ్రత్త’ అని వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలు షేర్‌ చేశారు. దీన్ని చూసిన నవదీప్‌ గట్టిగా సమాధానం ఇచ్చారు. ‘నాకు ఏం బాధ లేదు బ్రదర్‌.. నువ్వు కూడా బాధపడకు. పద పనికొచ్చే పనులు చేద్దాం’ అని రిప్లై ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu