HomeTelugu Trendingఅన్‌స్టాపబుల్‌ ప్రోమో: నానితో బాలయ్య సందడి

అన్‌స్టాపబుల్‌ ప్రోమో: నానితో బాలయ్య సందడి

Nani in balakrishna unstopp

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’.ఓటీటీ ‘ఆహా’వేదికగా ప్రసారమయ్యే ఈ షోకి రెండో ఎపిసోడ్‌కి అతిథిగా నాని వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ విశేషాలివీ..

‘ఈరోజు మన గెస్ట్‌ మీ నుంచి వచ్చాడు. సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్‌’ అంటూ నానిని ఉద్దేశించి బాలకృష్ణ చెప్పిన మాటలతో ప్రారంభమైన ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మాటలకు తగ్గట్టే నాని ఇచ్చిన ఇంట్రీ ఆకట్టుకుంది. బాలకృష్ణ-నాని కాసేపు క్రికెట్‌ ఆడారు. ఈ క్రమంలో అభిమానులు ‘జై బాలయ్య’ అంటుంటే ‘మీరు ఆగండ్రా. టెన్షన్‌ పెట్టకండి’ అని బాలకృష్ణ తనదైన శైలిలో నవ్వులు పంచారు. ‘ఒత్తిడి తగ్గించుకునేందుకు నువ్వు ఏం చేస్తావ్‌? ఎలా రిలాక్స్‌ అవుతావ్‌’ అని బాలకృష్ణ అడగ్గా ‘సినిమాలు చూస్తా’ సర్‌ నాని సమాధానమిచ్చారు. ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ బాలకృష్ణ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత.. తన సినిమా విడుదల విషయంలో ఎదుర్కొన్న సమస్యల్ని నాని వివరించారు. ఈ ఎపిసోడ్‌ నవంబరు 12 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu