లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి..?

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే లక్ష్మీస్ వీరగ్రంధం. లక్ష్మీ పార్వతి జీవిత కోణంలోనుంచి ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాను తీస్తున్నట్టు దర్శక నిర్మాతలు చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఆ తరువాత దానిగురించి ఎక్కడా వార్తలు లేవు.

ఇప్పుడు మరలా ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి రాకముందు..ఆమె జీవితం ఎలా ఉండేది. ఆమె జీవితంలో ఎలాంటి కోణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక.. ఎలా ఉంది అనే అంశాల చుట్టూ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో లక్ష్మి పార్వతిగా శ్రీ రెడ్డిని తీసుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రం లో నటించేందుకు శ్రీ రెడ్డి కూడా అంగీకరించినట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, ఈ వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.