HomeTelugu Newsమీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే.. అంటున్న నవీన్‌ చంద్ర

మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే.. అంటున్న నవీన్‌ చంద్ర

2 12నవీన్‌ చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘హీరో హీరోయిన్’. గాయత్రి సురేశ్‌, పూజా జవేరీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ట్విటర్‌ వేదికగా ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే..’ అంటూ నవీన్‌ చంద్ర చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో నవీన్‌ చంద్ర ఎన్టీఆర్‌ నటించిన సినిమాను పైరసీ చేస్తాడు.

దాంతో థియేటర్‌ వద్ద అభిమానులు నవీన్‌ చొక్కా పట్టుకుని ఇలా ఎందుకు చేస్తావని నిలదీస్తారు. ‘వచ్చే వారం రామ్‌చరణ్‌ సినిమా విడుదలవుతుంది. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా’ అని చెప్పగానే సదరు అభిమాని తెగ సంబరపడిపోవడాన్ని ఫన్నీగా చూపించారు. ‘ప్రొడ్యూసర్‌ కూతురివైతే నాకేంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అని నవీన్‌ చంద్ర తన ప్రేయసితో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి పైరసీతో ముడిపడిన ఓ ప్రేమకథా చిత్రమిది. టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈసినిమాలో అభిమన్యు సింగ్‌, కబీర్ దుహన్‌ సింగ్‌ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu