HomeTelugu Trendingనయనతార 75వ సినిమా ప్రకటన

నయనతార 75వ సినిమా ప్రకటన

Nayana 75th movie

నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి సిద్ధమవుతోంది. నయనతార కెరీర్‌లో ఇది 75వ సినిమా. ఈ చిత్రాన్ని ఎన్‌ఏఏడీ స్టుడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను జై సత్యరాజ్ పోషించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులు నయనతారకు శుభాకాంక్షలు చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

https://www.instagram.com/tv/Cf5o_XQBLq6/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu