HomeTelugu Big Stories'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ ట్రైలర్‌

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ ట్రైలర్‌

Nenu Meeku Baaga Kavalsinav

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ ఇది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాను నిర్మించింది. శ్రీధర్ గాదె డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సంజన ఆనంద్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేమ .. పెళ్లి .. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన డ్రామాతో ఈ సినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అదిస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా.. ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu