HomeTelugu Trendingదీపికను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

దీపికను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Deepika Singh

దేశంలో తౌక్టే తుఫాన్ పలు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాలు ముంబైను ముంచెత్తాయి. 120 కి.మీ. పైగా వేగంతో వీసిన ప్రచండ గాలులతో ముంబైలోని పలుచోట్ల భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుఫాన్ ధాటికి టీవీ నటి దీపికా సింగ్ ఇంటి ముందున్న ఓ చెట్టు కూలిపోయింది. కూలిన ఆ చెట్టు వద్ద దీపికా సింగ్ ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తుఫాన్‌ను మనం ఆపలేము, ఆ ప్రయత్నం కూడా చేయొద్దు, మనం ప్రశాంతంగా ఉండి ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు జనజీవనం స్తంభించింది. తుఫాన్‌తో ప్రజలు ప్రాణాలు పోతుంటే దీపిక ఫొటో షూట్ చేస్తూ ఎంజాయ్ చేయమనడంపై ట్రోల్ చేస్తున్నారు. దీపికపై పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!