HomeTelugu Trendingఆదిపురుష్‌: సీత ఎదురు చూపులు

ఆదిపురుష్‌: సీత ఎదురు చూపులు

new posters from adipurushపాన్‌ ఇండియా ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్’‌. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సీతగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతీసనన్‌ నటిస్తుంది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణలు వల్ల వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయింది.

దాంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తోంది. కొత్త పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కృతీసనన్‌ సీత పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ల ను విడుదల చేసింది. ఇందులో లంకలో ఉన్న ఆమె రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు కనిపించింది.

అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ ‘జై సియా రామ్‌’ ఆడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త పోస్టర్‌లో సీతమ్మగా కృతి సనన్‌ ఆకట్టుకునేలా ఉంది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu