అభిమానులకు మహేష్‌ న్యూఇయర్‌ కానుక..!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు సంబంధించి చిత్ర బృందం కొత్త ప్రకటన చేసింది. సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించారు. ‘మహర్షి’ రెండో లుక్‌.. రిషితో కలిసి న్యూఇయర్‌ వేడుకను జరుపుకోండి. రేపు ఇదే సమయానికి అతడిలోని మరో కోణాన్ని చూడండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘డిసెంబరు 31న సాయంత్రం 6.03 గంటలకు ‘రిషి’తో మీ అపాయింట్మెంట్‌ ఫిక్స్‌ అయ్యింది. అతడి ప్రయాణంలో భాగం అవ్వండి’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. అల్లరి నరేష్‌, నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, జయసుధ, సాయికుమార్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం.