HomeTelugu Trendingకష్ట కాలంలో ఇస్మార్ట్ బ్యూటీ సాయం...

కష్ట కాలంలో ఇస్మార్ట్ బ్యూటీ సాయం…

5 30కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో.. దాని ఆరికట్టేందుకు చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా బారిన పడి బాధ పడిన వారికన్న ఈ లాక్‌డౌన్ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోన్నారు. వీరిలో ముఖ్యంగా వలస కార్మికల పరిస్థితి వర్ణానాతీతం. తినడానికి తిండి లేక.. ఇంటికి పోదాం అంటే రవాణా లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కోన్నారు. వీరి బాధను చూసి చాలా మందీ తమకు తోచిన విధంగా సాయం చేశారు. కొందరూ వస్తు రూపంలో చేస్తే మరికొందరూ ధన రూపంలో చేసి వారి ఆకలిని తీర్చే ప్రయత్నం చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో సామాన్యుల నుండి రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రీటీస్ సమాజం పట్ల సామాజిక సృహ ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి తోటి ఈ కష్టకాలంలో తోడున్నారు. అందులో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వలస కూలీలకు అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేశారు. ఆమె వారి కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసి అందించే పనిలో ఉంది. ఆ విధంగా ఈ కఠిన పరిస్థితులలో తనకు తోచిన సాయం చేస్తుంది నిధి. దానికి సంబంధించిన ఓ ఫోటోను నిధి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రామ్‌ హీరోగా నటించిన ఇస్మార్ శంకర్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ..

Recent Articles English

Gallery

Recent Articles Telugu